Sunday, 24 June 2018

Prakasaam DEO Instructions and month wise action plan And Time Table to Primary Schools

Prakasaam DEO Instructions and month wise action plan And Time Table to Primary Schools

Prakasam DEO Sri VS Subbarao Garu release a month wise action plan and Time table for Primary Schools in prakasam dist.

Prakasaam DEO Instructions and month wise action plan And Time Table to Primary Schools

In that action plan DEO gives specific instructions and guidelines to Effective running and For quality of Education to strengthen the primary schools.
In that 14 Pages Detaild instructions focus on Time table/MDM/Time shedule/phone Usage/ library books/School complex meetings /Unit/lesson plans./Innovative activities/TLM/studen notbooks/radio lessons/co-curriculer activities/Sanitation/SMC meetings/Every friday -swachh vidyalaya/Every saturday -Theatre day Etc.

వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు గారు ఈ క్రింది విధంగా సూచనలు చేశారు.

●9 గంటలకు సెల్ఫోన్ స్విచాఫ్ చేసుకొని పూర్తి సమయమును పనికి కేటాయించి పాఠశాలలోనే ఉండవలెను.
●ప్రతిరోజు 9:05 నిమిషాలకు ప్రార్థనకు హాజరై ప్రార్థనను నిర్వహించ వలెను.
●వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళికలను ఉపాధ్యాయులందరూ ముందుగానే సిద్ధం చేసుకోవలెను.
●ప్రతిరోజు చెప్పబోయే పాఠ్యాంశ మనకు సంబంధించి లెసన్ ప్లాన్ ముందురోజే సిద్ధం చేసుకోవలెను.
●తగిన బోధనా  ఉపకరణములను ముందురోజే తయారుచేసుకోవాలి.
●సి గ్రూప్ విద్యార్థుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేసుకుని ఉండవలెను
●నిర్దేశిత టైంటేబుల్ ప్రకారము లెస్సొన్ ప్లాన్ ఆధారంగా పాటాలకు సంబంధించిన అంశములను బోధించవలెను. డబల్ పీరియడ్ ప్రణాళికను అమలు చేస్తూ రెండో సెషన్ ను పూర్తిగా విద్యార్థి కృత్యములకు కేటాయించవలెను.
●ప్రతిరోజు విద్యార్థుల రాతపని పరిశీలించ వలెను (నోట్ బుక్స్ చూచిరాత కాపీలు మొదలగునవి)
●ప్రతిరోజూ క్రమం తప్పకుండా రేడియో కార్యక్రమాలు వినిపించి రికార్డ్ రాయవలెను.
●గోడ పత్రిక పోస్ట్ బాక్స్ పిల్లల డైరీలను ప్రతిరోజు పరీక్షించ వలెను.
●మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం పెట్టించి  ఒక ఉపాధ్యాయుడు ప్రతిరోజు పర్యవేక్షించ వలెను.
●ప్రతిరోజు చివరి పీరియడ్లో నిర్దేశించిన పాఠశాల కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించ వలెను.
●ప్రతిరోజు సాయంత్రం చివరి సమయంలో విద్యార్థులచే వారములు నెలలు తిథులు ఎక్కములు చెప్పించవలెను.
●రెండు పూటలా పాఠశాలను పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడవలెను.
●టాయిలెట్స్ శుభ్రముగా ఉండేట్లు రన్నింగ్ వాటర్ వచ్చేటట్లు చూసుకొనవలెను.
●ప్రకాశం జిల్లా విద్యా కాలండర్ ఆధారంగా తల్లిదండ్రుల సమావేశాలు పాఠశాల యాజమాన్య కమిటీల సమావేశాలు ఉపాధ్యాయులు సమావేశాలు నిర్దేశించిన సమయాలలో జరుపవలెను.
●నిర్దేశించిన మీటింగులకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు తప్పనిసరిగా సమయానికి హాజరు కావలెను.
●మూడు రోజులు వరుసగా బడికి రానటువంటి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కలిసి కారణములను తెలుసుకోవలెను.
●ప్రతి శుక్రవారము స్వచ్ఛ పాఠశాల కార్యక్రమమును నిర్వహించ వలెను.
●ప్రతి శనివారము దియేటర్స్ డే ను నిర్వహించ వలెను.
●ప్రతి నెలలో ముఖ్యమైన దినములకు సంబంధించి సమాచారమును సేకరించు ఒక నోట్బుక్లో రాసుకుని ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో వివరించ వలెను.
●వారాంతంలో పూర్తి అయిన పటములలో డిక్టేషన్ క్విజ్ లాంటివి నిర్వహించ వలెను.
●వారానికి ఒకసారి మాస్ డ్రీల్ నిర్వహించ వలెను
●వారంలో రెండుసార్లు గ్రంథాలయ పట్టణమును ప్రోత్సహించవలెను.
●వారాంతంలో బాలల సంఘాల పనులను సమీక్షించి వలయును.
●ఫార్మటు పరీక్షలు సమయంలో విద్యార్థులకు ఒక ప్రాజెక్ట్ వర్క్ను ఇచ్చి వాటికి మార్కులు వేసి భద్రపరచి వలెను.
●నిర్దేశిత తేదీలు నెలల్లో ఫార్మెట్లు పరీక్షలు మరియు సమ్మె టు పరీక్షలు నిర్వహించి జవాబు పత్రాలు దిద్ది మార్కులను నిర్దిష్ట తేదీలలో ఆన్లైన్ చేయవలెను.
●మాసాంతంలో సి గ్రూప్ విద్యార్థుల గురించి సమీక్ష జరుపవలెను వారికోసం అమలు చేయబోయే వ్యూహాల గురించి చర్చించి వలయును.
●ప్రతినెల మాసాంతంలో ప్రతి విద్యార్థి ఒక కొత్త పద్యమును ఒక కథను స్వయంగా చెప్పేటట్లు చూడాలి.
●పరీక్షలకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టు తల్లిదండ్రులకు తప్పనిసరిగా పంపవలెను.
●డ్రాపౌట్స్ ను గుర్తించి మాసాంతంలో సి.ఆర్.పి సహకారంతో వారి తల్లిదండ్రులను కలిసి వారిని బడికి వచ్చినట్లు చేయవలెను.
●మాసాంతంలో తప్పనిసరిగా నిధుల వినియోగం గురించి చర్చించ వలెను.
●పాఠశాల వార్షికోత్సవ మును మార్చి నెలలో తప్పనిసరిగా నిర్వహించ వలెను.
●ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ తయారు చేయ వలెను.
పై అంశములు అన్నింటిని ఉపాధ్యాయులందరూ చదువుకుని తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుని పిల్లల మనస్సులలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని నింపుతూ వారితో మీరు కృత్య  ఆధారంగా ఆడుకుంటూ పాడుకుంటూ వారిని విద్యా ప్రగతిలో ముందుకు తీసుకుపో తూ ప్రకాశం జిల్లాను విద్యా ప్రకాశమ్ జిల్లా గా చేస్తారని ఆశిస్తూ.... 
                                      వి.ఎస్ సుబ్బారావు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకాశం జిల్లా

Prakasaam DEO Instructions and month wise action plan And Time Table to Primary Schools
Prakasaam DEO Instructions and month wise action plan And Time Table to Primary Schools
Download....DEO Prakasam Instructions to Primary School Teachers




0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top