Wednesday, 26 September 2018

Supreme Court Judgement on Aadhar -ఆధార్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court Judgement on Aadhar -ఆధార్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆధార్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

◆ బ్యాంకులకు ఆధార్ లింక్ అవసరంలేదు

◆ స్కూల్ విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి కాదు.. ఆధార్ కార్డ్ కావాలని ప్రైవేట్ విద్యా సంస్థలు డిమాండ్ చేయరాదు

◆ మొబైల్, ప్రైవేట్ సంస్థలకు ఆధార్ తప్పనిసరి కాదు
Supreme Court Judgement on Aadhar -ఆధార్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రాజ్యాంగ బద్ధంగా ఆధార్‌ చెల్లుబాటు అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే అనేక షరతులు విధించింది. ముఖ్యంగా సెక్షన్‌ 37ను రద్దు చేసింది.  ఇప్పటి వరకు ప్రైవేట్‌ సంస్థలు తమ ఖాతాదారుల ఆధార్‌ వివరాలు అడిగేందుకు సెక్షన్‌ 37 వీలు కల్పిస్తోంది. ఈ సెక్షన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయడంతో ఇక నుంచి బ్యాంకులు, మొబైల్‌ టెలిఫోన్‌ కంపెనీలు వంటి ప్రైవేట్‌ సంస్థలు జనం నుంచి ఆధార్‌ కార్డు వివరాలు అడగడానికి వీలు లేదు. సమాజంలో బలహీనవర్గాలకు ఆధార్‌ కార్డు ఓ తరహా గుర్తింపు ఇస్తోందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిక్రీ అభిప్రాయపడ్డారు. ఆయన ఇవాళ తీర్పు చదువుతూ ఆధార్‌ అత్యుత్తమైనది కాకపోయినా.. చాలా విశిష్టమైనదని పేర్కొన్నారు. ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడాన్ని సమర్థిస్తూనే అనేక షరతులు విధించింది. అథెంటికేషన్‌కు సంబంధించిన డేటా ఆరు నెలలకంటే ఎక్కువ రోజులు భద్రపర్చరాదని స్పష్టం చేసింది. పాఠశాలల్లో ప్రవేశానికి కూడా ఆధార్‌ కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆధార్‌ కు సంబంధించిన బిల్లును ప్రభుత్వం మనీ బిల్లుగా పేర్కొనడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదొక చెడు సంప్రదాయానికి తెర లేపినట్లయిందని జస్టిస్‌ సిక్రీ అన్నారు.


0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top