Friday, 12 October 2018

CSE instructions on Ehazar Review Meeting

CSE instructions on Ehazar Review Meeting

తేది.12-10-2018 న కమీషనర్ ఆఫీసులో జరిగిన eహాజరు సమీక్ష సమావేశంలో కమీషనర్ గారి ముఖ్య సూచనలు:
CSE instructions on Ehazar Review Meeting
▪1. ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల లోనే ఈహాజరు వేసేలా చర్యలు చేపట్టాలి. కొంత మంది ఉపాధ్యాయులు వారి ఇంటి వద్ద బయోమెట్రిక్ వేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది అని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

▪2. అనవసర OD లు నివారించాలని సూచించారు. చాలా మంది టీచర్లు పాఠశాలలో డివైస్ పనిచేయకపోతే OD పెడుతున్నారని అలా చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు.

▪3. ఒకే ఒక టీచర్ ఉన్న పాఠశాలల్లో ఈహాజరు 100% అమలు చేయాలని సూచించారు.

▪4.ఐరిష్ డివైస్ లు ఇంతవరకు వాడని పాఠశాలలు 27 ఉన్నాయని వాటిని Return చేయాలని ఆదేశించారు.

▪5. టీచర్ల  leave credits అన్నీ వారి SR ఆధారంగా DDO cse login లో confirm చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్య వైఖరి తగదని, MEO,HM,DyEO అందరూ ఈ ప్రక్రియ వారంలో పూర్తిచేయాలని సూచించారు

▪6.MEO,DyEO,DIET staff  అందరూ eహాజరు వేయాలి.

▪7.నెట్ వర్క్ లేని పాఠశాలలలో వెంటనే ఆఫ్ లైన్ లో eహాజరు అమలు చేయాలని ఆదేశించారు.

▪8.పాఠశాల మొదలు పెట్టిన రోజు నుండి ఈరోజు వరకు 86 రోజుల్లో ఒక్క రోజు కూడా బయోమెట్రిక్ హాజరు వేయని వారికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వేయక పోవడానికి కారణం ఏమిటి అని గుర్తించాలని సూచించారు.


0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top