Friday, 19 October 2018

DSC latest Updates -25, 26 తేదీల్లో డీఎస్సీ ప్రకటన? పాఠ్యాంశాలను ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లోనే డీఎస్సీ నిర్వహణకు యోచన ఎస్జీటీ ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షకు ఉత్తర్వులు జారీ

DSC latest Updates -25, 26 తేదీల్లో డీఎస్సీ ప్రకటన? పాఠ్యాంశాలను ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లోనే డీఎస్సీ నిర్వహణకు యోచన ఎస్జీటీ ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షకు ఉత్తర్వులు జారీ

25, 26 తేదీల్లో డీఎస్సీ ప్రకటన? 
పాఠ్యాంశాలను ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ 
  ఆన్‌లైన్‌లోనే డీఎస్సీ నిర్వహణకు యోచన 
  ఎస్జీటీ ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షకు ఉత్తర్వులు జారీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఎలాంటి అవాంతరాలు రాకపోతే ఈ నెల 25, 26వ తేదీల్లో డీఎస్సీ ప్రకటన విడుదల చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం దస్త్రాన్ని సోమ, మంగళవారాల్లో ప్రభుత్వానికి పంపాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. ఇందులో కొన్ని ఇబ్బందులున్నా ఆన్‌లైనే మేలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంటోంది..
DSC latest Updates -25, 26 తేదీల్లో డీఎస్సీ ప్రకటన? పాఠ్యాంశాలను ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లోనే డీఎస్సీ నిర్వహణకు యోచన ఎస్జీటీ ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షకు ఉత్తర్వులు జారీ

మరోపక్క డీఎస్సీకి సంబంధించి పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను(సిలబస్‌) ఖరారు చేసింది. ఈసారి ఎస్జీటీలకు ఉపాధ్యాయ అర్హత(టెట్‌), నియామక పరీక్ష(టీఆర్టీ)లను కలిపి నిర్వహిస్తోంది. స్కూల్‌ అసిస్టెంట్లు, టీజీటీ, పీజీటీలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించనుంది. ఎస్జీటీలకు 8వ తరగతి, స్కూల్‌ అసిస్టెంట్లు, టీజీటీలకు ఇంటర్మీడియట్‌, పీజీటీలకు డిగ్రీ స్థాయి వరకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. టెట్‌, టీఆర్టీని కలిపి వంద మార్కులకే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ వంద మార్కుల్లోనే 20% లెక్కించి టెట్‌ వెయిటేజీగా ఇవ్వాలని ఆలోచనగా ఉంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖ నుంచి వచ్చిన షెడ్యూలు ఏరియా, నాన్‌ షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలల పోస్టుల్లో కొన్ని చిత్రలేఖనం, ఆర్ట్‌, క్రాఫ్ట్‌ పోస్టులు ఉన్నందున వీటికి సంబంధించిన పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. మూడు రోజుల్లో సిలబస్‌కు సంబంధించిన దస్త్రాన్ని పరీక్షల నిర్వహణ విభాగానికి అప్పగించనున్నారు.

వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు అనుమతి అవసరంఎస్జీటీలకు టెట్‌, టీఆర్టీ నిర్వహణకు అనుమతిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవి పాఠశాల విద్యాశాఖకు అందాయి. కొత్తగా మంజూరు చేసిన వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి లభించాల్సి ఉంది. అనుమతి లభించిన వెంటనే రిజర్వేషన్‌ రోస్టర్‌, సిలబస్‌ వివరాలతో దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపనున్నారు. పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖకు అందించాయి. ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్ల రిజర్వేషన్‌పై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top