Monday, 8 October 2018

IT Return Submissiin Date Extended October 31

IT Return Submissiin Date Extended October 31

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగింపు
⬛ దిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) సోమవారం ప్రకటన ఇచ్చింది. ఐటీ రిటర్న్‌ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును 31 అక్టోబరు 2018 వరకు పొడిగిస్తున్నారు. కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశం వర్తిస్తుంది’ అని సీబీడీటీ ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు ఆడిట్‌ రిపోర్టు పరిశీలన తుది గడువును కూడా అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు తెలిపింది.*.
IT Return Submissiin Date Extended October 31
⬛ *ఐటీ రిటర్న్‌ దాఖలు గడువును పెంచడం ఇది నాలుగో సారి. 2017-18(అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2018-19)కి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి తొలుత ఆగస్టు 31 వరకు గడువును పొడిగించారు. ఆ తర్వాత మరోసారి తేదీని పొడిగించి సెప్టెంబరు 30 లోపు ఐటీ రిటర్న్‌ దాఖలు చేయాల్సిందిగా సీబీడీటీ ప్రకటించింది.మళ్లీ ఆ తేదీని అక్టోబరు 15 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ తేదీని మార్చింది. అక్టోబరు 31 వరకు గడువు ఇస్తున్నట్లు తెలియజేసింది.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top