Tuesday, 27 November 2018

ఏపీ డీఎస్సీ వాయిదా..నేడు కొత్త షెడ్యూల్!

ఏపీ డీఎస్సీ వాయిదా..నేడు కొత్త షెడ్యూల్!

ఏపీ డీఎస్సీ వాయిదా..నేడు కొత్త షెడ్యూల్!

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం నిర్వహించాల్సిన ఏపీ డీఎస్సీ మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకటించిన డీఎస్సీ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేందుకు సమయం సరిపోదని, కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపుతున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే తాము నష్టపోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 6 నుంచి జనవరి 3 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. షెడ్యూల్ విడుదలైన తరువాత, పరీక్షకు సమయం తక్కువగా ఉందని, తమకు ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చిన మేరకు, సీఎంతో చర్చించి, రెండు వారాలు వాయిదా వేశామని గంటా అన్నారు. కొత్త షెడ్యూల్ ను నేడు ప్రకటిస్తామని చెప్పారు.

ఈ నెల 18తో గడువు ముగియగా.. రికార్డు స్థాయిలో 6,08,157 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయి, సెంటర్ల కోసం ఆప్షన్ల పర్వం కొనసాగుతున్న తరుణంలో.. రాత పరీక్షలను కొంత కాలం పాటు వాయిదావేయాలన్న వినతులు ఎక్కువయ్యాయి. కాగా, డీఎస్సీలో అన్ని పోస్టులూ కలిపి 7,729 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, ఆరు లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆన్ లైన్లో పరీక్ష నిర్వహించాలా? లేక ఆఫ్ లైన్ లో నిర్వహించాలా? అన్న విషయంపైనా విద్యాశాఖ ఇంకా నిర్ణయించలేదు.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top