Thursday, 6 December 2018

Dr. Bhimrao Ramji Ambedkar life history -

Dr. Bhimrao Ramji Ambedkar life history -

డా.అంబేద్కర్ ఏప్రిల్ 14,1891న రాంజిసక్పాల్, భీమాబాయ్ దంపతులకు జన్మించాడు.

సంత్ కబీర్ దాస్ ఆధ్యాత్మిక ప్రభావం ఇంట్లోకనిపిస్తుంది. తండ్రి రాంజి ఒక సైనిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు.
తాను జన్మించిన మహర్ అనే కులం ఆ రోజుల్లో ,అంటరానివారిగా భావించి, సైనికులుగా కూడా భర్తీ చేసేవారు కాదు..రాంజీ కారణంగా అది తొలగిపోయింది.
Dr. Bhimrao Ramji Ambedkar life history -
అంబేద్కర్ 10 సంవత్సరాల వయస్సులో బడిలో న్యాయమూర్తి రానడే 101వ జయంతి లో ప్రసంగం చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఘోరమేమిటంటే. ఇంతటి మేధస్సు గల అంబేద్కర్ అందరు విద్యార్తులతో కలిసి కూర్చుని తరగతిలో చదవనివ్వరు. అందరితో కలిసి ఆడుకోవడానికి వీలు లేదు. నీళ్ళు త్రాగనివ్వరు. ఒకసారి అన్నదమ్ములిద్దరు ఎడ్లబండిలో
వెల్తుంటే మహర్ కులమని తెలిసి బండివాడు వాళ్ళిద్దరినీ క్రింద పడేశాడు. మరొక్కసారి బావిలొ నీళ్ళు త్రాగినందుకు దెబ్బలు కొట్టారు. మరోసారి మంగలి ఇతని వెంట్రుకలు కత్తిరించలేదు. ఈ
సంఘటన అతని మనసు పై తీవ్ర ప్రభావం చూపింది. 5ఏళ్ళ వయస్సులొ అమ్మ చనిపొయింది. ఈ అన్యాయాలను నిర్మూలించాలంటే తాను బాగా చదువుకోవాలని నిర్ణయించాడు. ముంబాయి ఎల్ఫిన్స్టన్ స్కూల్లో చేరాడు. తండ్రి కొడుకులిద్దరు ఒకె గదిలొ ఒకే చద్దర్ మీద ఒకరు పడుకుంటె , మరొకరు మేల్కొని వుండి, 17 వ వయస్సులో 10వ తరగతి లొ పాసయ్యాడు. మహర్ కులంలో పాస్ కావటంలో మొదటి వాడు అంబేద్కర్. వడొదర మహరాజ్ ఇచ్చే 25 రుపాయల స్కాలర్షిప్ తో కాలేజిలో 1912లో బి ఏ పూర్తిచేశాడు.
1913 లో తండ్రి రాంజి మరణించారు. అదే సంవత్సరం అమెరికా వెళ్ళాడు.
కొలంబియా విశ్వవిద్యాలయం లో 1915 లొ ఎం ఏ పట్టా పొందాడు. 1916 లో పి హెచ్ డి పొందాడు.ప్రొవిన్సియల్ ఎకనామిక్ సిస్టం
ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పరిశోధనా పత్రం వ్రాసి మహరాజు సయాజిరావ్ కి అర్పితం చేశాడు.అదే కొలంబియా విశ్వవిద్యాలయం 1952 లో అంబేద్కర్ కు డాక్టర్ ఆఫ్ లాజ్
గౌరవ బిరుదు ఇచ్చింది.
1916 లో ఆయన లండన్ వెళ్ళి ఉన్నత విద్య పొందారు..తిరిగి వచ్చి మళ్ళీ ఇంగ్లాండ్ లో 1922 లో బారిస్టర్అ య్యాడు. 1923 లో ప్రాబ్లం ఆఫ్ ద రూపీ అను వ్యాసం వ్రాశారు. దీనికి
గాను డి ఎస్ సి గౌరవం పొందారు.అది పొందిన మొదటి భారతీయుడయ్యాడు
గుజరాత్ లోని వడొదరలో సయాజిరావ్ వద్ద రక్షణకార్యదర్శి గా పనిచేశారు.
ఆఫీస్లో గుమాస్తాల ద్వారా అంటరాని తనపు అవమానాలు పొందాడు.ఫైళ్ళు చేతికి ఇవ్వకుండా టేబుల్ పైన విసిరిన సంఘటనలు, ఇళ్ళు కిరాయికి ఇవ్వకుండా కొందరు పార్శీలు ఇంటినుండి వెళ్ళగొట్టడం ఇవన్నీ డా అంబేద్కర్ని తీవ్రంగా ఆలోచింపచేశాయి.
మహర్ కులంలో పుట్టిన అపరాధం ఎంతకాలం సహించాలి?
చదువుకుంటే గౌరవం లభిస్తుందనుకుంటే, కనీసం సమానంగా చూడని
పరిస్థితి.ఎందుకిలా?
చివరకు చప్రాసి కూడా తాకడానికి ఇష్టపడటం లేదు.నా పరిస్థితి ఇలా వుంటే నా చదువురాని నా నిమ్న వర్గాల ప్రజల బాధలు ఎవరికి చెప్పుకోవాలి.?
ఇది సహించరాని విషయం..
ఇక నుండి నా పూర్తి జీవితం సామాజిక అన్యాయాల నెదిరించడానికి వెచ్చించాలి..మహాత్మ ఫూలె ద్వారా విద్యా రంగం లో ఒక ప్రయత్నమైతే జరిగింది.విద్య ఒక్కటే కాదు నిమ్న వర్గాలను సంఘటిత పరిచి ఈఅన్యాయాలను వ్యతిరేకించాలి.ఆ దిశలో గట్టిగా కొన్ని ప్రణాళికలు రచించి
ఉద్యమించాలి..
ఈ విధంగా డా అంబేద్కర్ తన అలోచనలకు క్రియా రూపాన్ని ఇచ్చేందుకు 1920 లో మూకనాయక్ పత్రికను ప్రారంభించారు.స్వాతంత్ర్య ఉద్యమం కంటే సామాజిక ఆందోళనకు
ప్రాధాన్యత ఇచ్చారు..సామాజిక సంస్కరణ..సామాజిక సమత…సామాజిక సమరసత ..కోసం ముందుకు కదిలాడు.
కొల్ హా పూర్ షాహూ మహరాజ్ మూకనాయక్ పత్రికకు నిధులు అందజేశారు.
డా అంబేద్కర్ తాను పొందిన లెక్కలేనన్ని పట్టాలకు, మంచి ధనం సంపాదించగలవాడే..కాని సమరసతా సాధనలొ తన జీవితం ఫణంగా పెట్టాడు.
1924 లో బహిష్కృత భారత్ అను సంస్థ ను ప్రారంభించి నిమ్న వర్గాల చదువు, ఆర్థిక సహకారానికి తోడై నిలిచాడు.
విద్యార్థులకు హాస్టల్, ఒక గ్రంధాలయం తెరిచాడు. 1927లో మహద్ చెరువు సత్యాగ్రహం స్వాభిమానంతో మొదటిసారిగా బహిరంగఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. మొదటిసారిగా ఆ చెరువు నీళ్ళు తాగాడు. వెంటనే సవర్ణులు దాడి చేశారు. విశేషమేమిటంటే అది మహాత్మ ఫూలే జన్మ శతాబ్ది సంవత్సరం.
1930 లో మార్చి 2 న నాసిక్ లోని కాలా రాం మందిర్ లో ఎస్ సి వర్గాల ప్రవేశం కోసం సత్యాగ్రహం చేశాడు.ఆ తరువాత 1935లో అందరి కోసం ఆ దేవాలయ ద్వారాలు తెరుచుకున్నాయి.
1930లో లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళారు.
అక్కడ నిమ్నవర్గాల సమస్యలు ముందు పెట్టాడు.దీన్ని ఆసరగా తీసుకుని ఆంగ్లేయులు విభజించు పాలించు అను కుటిలనీతితో హిందువుల నుండి నిమ్నవర్గాల ప్రజలను వేరుచేసేప్రయత్నం మొదలు పెడితే దానిని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు
1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళే ముందు గాంధిజీని కలిశారు. కాంగ్రెస్ నిమ్న వర్గాలకు చేస్తున్నదేమీ లేదని చెప్పాడు. సవర్ణులు ఇచ్చిన హరిజన్ అనే పదాన్ని వ్యతిరేకించాడు. లండన్ సమావేశం తో వారిద్దరి మధ్య భేదాలు ఎక్కువయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డ్ పేరుతో నిమ్నవర్గాల కోసం ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించి, నిమ్న వర్గాల ప్రజలే ఓటు వేసి విధానాన్ని ప్రతిపాదించారు. దీన్ని గాంధిజి వ్యతిరేకించి,
ఆమరణ నిరాహార దీక్ష జరిపారు. దేశమంతా దాని ప్రభావం కనపడింది. డా అంబేద్కర్ దిగి వచ్చి,పూనా వెళ్ళి, పూనా యాక్ట్ఒ ప్పందాన్ని చేసుకున్నారు. బ్రిటీష్ వారి కుట్ర కేవలం నిమ్న వర్గాలను హిందువులనుండి వేరుచేయటమనే .భావం గాంధిజి కి కలిగింది. పూనా ఒప్పందం తరువాత 148 నియోజకవర్గాలు ప్రత్యేకించబడినాయి.
1932 లో మూడవసారి రౌండ్ టేబుల్ సమావేశంలో ముస్లిం లీగ్ ప్రత్యేక దేశం కోసం చేసిన
ప్రతిపాదనను డా అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
నిమ్న వర్గాల కోసం ఉద్యమించిన డా అంబేద్కర్  ధర్మం ఆధారంగా మనుష్యులు ఒక ఆదర్శ జీవనాన్ని కొనసాగించాలని కోరుకున్నారు. నైతిక జీవనం మనిషిని ఉన్నతంగా నిలబెడుతుందని చెప్పారు.
అందుకే బుద్ధుడు చెప్పిన ‘ఆత్మ దీపో భవ ‘ అను సూక్తి డా అంబేద్కర్ ఒక దీపస్తంభం వలే భావించాడు. నిమ్న వర్గాల ప్రజలు శాంతి,దయ, ప్రేమలతో జీవించాలంటే మతానికి
ప్రాధాన్యత నివ్వాలని అభిప్రాయపడ్డారు. అది మాత్రమే సమాజం లోని చెడుని దూరం చేస్తుందని విశ్వసించాడు.
Dr. Bhimrao Ramji Ambedkar life history -
1935 లో భార్య రమాబాయ్ చనిపోయింది. అంతకుముందే ఇద్దరు సంతానం చనిపోయారు. సమాజ కార్యంలో ఆయనకు ఏడ్వడానికి సమయం లేదు. అదే సంవత్సరం ప్రిన్సిపాల్ గా పని చేసి,అది వదలి పెట్టి పూర్తి జీవితం సమాజానికి అంకితం చేశాడు.
తన చివరి జీవితకాలంలో డా.సవితను వివాహం చేసుకున్నాడు. ఆమె సహధర్మచారిణిగా అంబేద్కర్ కి శ్రద్ధతో సపర్యలు చేసింది.
నిమ్న వర్గాల ప్రజలు , సవర్ణుల ద్వారా ఎదుర్కొంటున్న అన్యాయం చూసి రగిలిపోయాడు. మనుస్మృతి ని తగలపెట్టారు. రామ క్రిష్ణులను నిందించారు. నా ప్రజలకు నేను
వ్రాసిన రాజ్యాంగం కూడా ఉపయోగపడక పోతే దీన్ని కూడా తగలపెడతాను అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.
ఈ చర్యలన్నీ కేవలం తన ప్రజలకు న్యాయం జరగాలనే తపనలో నుండి వచ్చినవే తప్ప, ఈ దేశం పట్ల, ధర్మం పట్ల శ్రద్ధ లేక కాదు. సంస్కృతం నేర్చి, పురాణ ఇతిహాసాల్లో అంటరానితనం ఎక్కడా లేదని,ఇది కేవలం 2000 సంవత్సరాల క్రితం మొదలైన దురాచారమని పేర్కొన్నాడు. ఆర్యులు బయటినుండి వచ్చారని చెప్పటం తప్పని, ఆర్య అనే పదం ఒక వర్గానికి చెందిన పదం కాదని,అది మంచితనం,గుణ వాచకమని నిరూపించాడు. తన గురువైన ఫూలే అభిప్రాయాన్ని కూడా ఖండించి, తన అధ్యయనం ద్వారే ఇది నిర్ద్వందంగా చెప్తున్నానని ప్రకటించాడు.
అంతే కాదు, పాశ్చాత్య దేశాల్లో జాతీయత సంస్కృతి భావన వికసించకముందే మన దేశం లో భిన్నత్వంలో ఏకత్వం వంటి ఉన్నత సంస్కృతి వ్యాప్తిచెందిందని వారు గర్వంగా చెప్పారు.
13 అక్టోబర్,1935 లో అప్పటి హిందూ సమాజ పెద్దలకు షాక్  ట్రీట్మెంట్ ఇస్తూ, తాను హిందు మతం లో చావనని అన్నాడు. చర్చ్ అధిపతి క్రైస్తవంలో , నిజాం నవాబ్ ఇస్లం చేరలని
ప్రలోభ పరిచారు. అయినా హిందూ సంస్కృతిలో భాగమైన నిమ్న వర్గాలకు శాంతి,దయ,ప్రేమలు అందించే బౌద్ధాన్ని 1956 అక్టోబర్ 14 న లక్షలాది మంది తో చేరి అప్పుడు తుఫానులాగా వీస్తున్న కమ్యూనిజపు సిద్ధాంతం నుండి తన సోదరులను రక్షించిన ఘనుడు
డా అంబేద్కర్..
1940 లొ థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ పుస్తకం వ్రాశాడు.
1942 లొ బ్రిటిష్ వైస్రాయ్ లో కార్మిక విభాగ మంత్రిగా చేరాడు.అదే సంవత్సరం ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ఫె డరేషన్ సంస్థ ను ప్రారంభించారు. 1947 లో నెహ్రూ మంత్రి వర్గం లో న్యాయ శాఖా మంత్రి అయ్యారు. 2 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగ రచనగావించారు. అది
భీమస్మృతి గా పిలుస్తారు కొందరు. స్వేచ్చ,సమత,బంధుత్వం ఈ మూడు తాను ఫ్రెంచ్ విప్లవం నుండి తీసుకోలేదని, బౌద్ధం నుండి గ్రహించానని చెప్పి, ఆ మూడు ఒకదానికొకటి పూరకంగా వున్నప్పుడే సామాజిక న్యాయం వెల్లివిరుస్తుందని ప్రకటించారు.
1954 లో భండారా ఉప ఎన్నికలో తన అనుయాయులు తన గెలుపు కొసం రెండవ వోటు ను వృధా చెస్తామని అన్నప్పుడు,తాను అందించిన రాజ్యాంగ స్పూర్థికి అది విరుద్ధమని చెప్పి, తాను ఓడిపోయాడే కాని, ఆదర్శం వదలిపెట్టలేదు.
1952 లో ఒక కార్యక్రమం కొసం డబ్బులు చందా రూపకంగా సేకరించారు.రశీద్ పుస్తకాలు తిరిగి రాలేదు.. అప్పుడు ఆయన ఒక్కొక్క పైసకు లెక్క రశీద్ వుండాలని, పైస లెక్క చూపించకపోవటం మహాపాపమని తన అనుయాయులకు నీతి బొధించారు.
న్యాయశాఖా మంత్రిగా వున్నప్పుడు తన పుత్రుడు ఇద్దరు ఉద్యోగుల కోసం సిఫారస్ చేయడానికి
వచ్చినప్పుడు,తిరస్కరించి, క్యాబిన్ నుంది బయట కు వెళ్ళగొట్టాడు. నెహ్రు మంత్రి వర్గం నుండి, హిందూ కోడ్ బిల్లు విషయం లో వచ్చిన విబేధాల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేసి, తనకు ఆదర్శమే ముఖ్యమని ప్రకటించిన మహనీయుడు.
ఎస్ సి వర్గాల అభ్యున్నతికి కేవలం ఒక కులాన్నే సంఘటిత పరచటం సరియైనది కాదని, అన్ని వర్గాల ప్రజలను సమీకరించే పని చేయాలని పేర్కొన్నారు.
డా అంబేద్కర్ చూడాటానికి కఠొరంగా కంపించినా, వారి మనసు వెన్న వంటొ కోమలమైనది.వారి హృదయం దయ తో పరిపూర్ణమైనది..వారి జీవితం ఆదర్శమైనది. నిమ్న వర్గాల
పట్ల సవర్ణుల అభిప్రాయాన్ని సానుకూలత గా మలచటానికి అత్యంత సహనంతో ఉద్యమించారు. సమాజాన్ని కులాల వారిగా విభజించే ద్వేషంతో కూడిన రాక్షస క్రొధం కాదు. తప్పులు సవరించే అమ్మ చూపే కోపాన్ని కలిగి సమాజాన్ని కలిపివుంచిన
విశాల హృదయ సంపన్నుడు. డిసెంబర్ 6 , 1956 లో వారు ఆత్మ అనంత లోకాల్లొకి
వెల్లింది. మన భారతీయులందరికి ఒక అనుసరణీయుడిగా మన మనసుల్లో ఇప్పటికీ వెలుగొందుతూనే వున్నాడు. వారి బాటలో సమాజంలో సమరసత నిర్మాణానికి ముందుకు కదలుదాం.

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top