Wednesday, 5 December 2018

‘Happiness Curriculum' i- బడి పరివర్తన'-ఆటపాటలతో బోధనకు రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమం

‘Happiness Curriculum' i- బడి పరివర్తన'-ఆటపాటలతో బోధనకు రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమం

‘బడి పరివర్తన'-ఆటపాటలతో బోధనకు రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమం

భూటాన్‌ విద్యావిధానం స్ఫూర్తితో ‘బడి పరివర్తన’ కార్యక్రమం అమలుకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పిల్లల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా.. సులభంగా పాఠ్యాంశాలు నేర్చుకునేలా ఆటపాటలతో విద్యాబోధన సాగిస్తారు.
‘Happiness Curriculum' i- బడి పరివర్తన'-ఆటపాటలతో బోధనకు రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమం

 ఇప్పటికే భూటాన్‌తో కలిసి దిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసి సత్ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ టాటా ట్రస్టుతో కలిసి ఐదేళ్లపాటు విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇందుకోసం భూటాన్‌తో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది.

 ‘బడి పరివర్తన' -నిర్వహణ అంశాలు

★ విద్యార్థులకు సులభంగా పాఠాలు నేర్పించేందుకు హ్యాపీనెస్‌ పాఠ్యాంశాలు రూప కల్పన.
★ ఆటపాటలతో బోధన.
★ తరగతిలో వెనుకబడుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన.
★ పట్టణం, గ్రామీణం, సామాజిక అంతరాలను తొలగించడం లక్ష్యంగా కార్యక్రమాలు.
★ విద్యలో సామాజిక భాగస్వామ్యం.
★ డిజిటల్‌ అక్షరాస్యతలో భాగంగా విద్యార్థి సొంతంగా నేర్చుకునేందుకు ట్యాబ్‌లు అందిస్తారు.

ఇదీ.. త్వరలో ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ప్రయివేటు ఉపాధ్యాయ విద్యాశిక్షణ సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన కార్యక్రమం..

ఈ ఆటపాటల విద్యాబోధన అవగాహన చేసుకొని ఆచరణలోకి తీసుకురావాలి.. మనపొరుగు దేశం భూటాన్ లో అమలవుతున్న విధానం... మన దేశరాజధాని దిల్లీలోHappiness curriculum ,రూపకల్పన చేసి అమలుకు శ్రీకారంచుట్టారు ...త్వరలో మన రాష్ట్రంలోనూ... "బడిపరివర్తన" లక్షిస్తూ.. School transformation కొరకు భూటాన్ దేశంసహకారంతో మన రాష్ట్రంలో అమలుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైన సందర్భంగా. ఈ కార్యక్రమం గురించి వెబ్సైట్లలలో సందర్శించి E content TE core team సమగ్ర అవగాహన పొందండి... మీ మీ కళాశాలలో ఒక ఫోకస్డ్ గ్రూప్ డిస్క్రిషన్ ఇనీషియేట్ చేయండి.. మీ చాత్రోపాధ్యాయులలో Tech-savvy లను గుర్తించండి..

ప్రస్తుతం వివిధ యన్జీవోలభాగస్వామ్యంతో.  అనందలహరి.  రివర్ టైడ్.   ఇషావిద్య... ఇషా ఫౌండేషన్.. TaRal ప్రథమ్... అక్షర ఫౌండేషన్.. గణిత మిత్ర... ఇటీవలే ముగిసిన ఆంగ్లమాధ్యమం ఉపాధ్యాయుల శిక్షణకొరకు రూపకల్పన చేసిన Know how module.... NRI ల ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ 70 శాతం ఆర్థికతోడ్పాటు...

త్వరలో SAMSUNG digital infrastructure in all govt TEIs

Adobe free software support and training గురించి వెబ్ బ్రౌజింగ్ ద్వారా మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా అవగాహన పొందండి...మీ సహ ఉపాధ్యాయులకు.. Informal గా నైనా అవగాహన కల్పించండి.. నాణ్యమైన విద్యనందించడానికి పాఠశాల విద్యాశాఖ రూపకల్పన చేసి అమలుబాధ్యత క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు ఇచ్చిన సందర్భంగా.. ప్రధానంగా క్షేత్రస్థాయిలోని ప్రతి విద్యాధికారి మీ మండలం/డివిజన్/జిల్లా/జోన్ లలో అమలు కు సంబంధించి ప్రతిరోజూ ఒకగంటైనా ఆన్లైన్ మానిటరంగ్.

సమీక్ష.. 5శాతం ఆకస్మిక తనిఖీలు చేయగలిగితే.   Effective implementation... కల సాకారమౌతుంది.. ఈ దిశగా ప్రతి విద్యాధికారి...ఇప్పటికే అమలు చేస్తున్న.. మీ షెడ్యూల్ ను మరింత విస్తృతంగా, సమగ్రంగా అమలు చేస్తారని విన్నవిస్తూ..

గుడిపాటి నారాయణ
పూర్వబాధ్య ప్రధానాచార్యులు
డైట్ రాయచోటి కడపజిల్లా

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top