Monday, 7 January 2019

APPSC - 14 Job notifications- Details... ఈ నెలాఖరులోపు 14 ఉద్యోగ ప్రకటనలు క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలన్నీ భర్తీకి ఏర్పాట్లు అందరికీ సమన్యాయం జరిగేలా కసరత్తు: ఏపీపీఎస్సీ చైర్మన్‌

APPSC - 14 Job notifications- Details... ఈ నెలాఖరులోపు 14 ఉద్యోగ ప్రకటనలు క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలన్నీ భర్తీకి ఏర్పాట్లు అందరికీ సమన్యాయం జరిగేలా కసరత్తు: ఏపీపీఎస్సీ చైర్మన్‌

మరో 1521 పోస్టులు

ఈ నెలాఖరులోపు 14 ఉద్యోగ ప్రకటనలు
క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలన్నీ భర్తీకి ఏర్పాట్లు
అందరికీ సమన్యాయం జరిగేలా కసరత్తు: ఏపీపీఎస్సీ చైర్మన్‌
అమరావతి: నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్సీ మరో శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోపు మరో 14 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, వీటి ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని 1521 ఖాళీలను భర్తీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ వెల్లడించారు. గత నోటిఫికేషన్లకు సంబంధించి క్యారీ ఫార్వర్డ్‌ అయిన పోస్టులన్నింటినీ ప్రస్తుత నోటిఫికేషన్లలో కలిపి భర్తీచేస్తామని స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి సర్వీస్‌ రూల్స్‌కు సవరణలు, విద్యార్హతలు, పరీక్షల స్కీమ్‌, సిలబస్‌ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి సమాచారం రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వీలుగా గత ఏడాది సెప్టెంబరు 19న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు డిసెంబరులోపు 3,255 పోస్టుల భర్తీ కోసం 21 నోటిఫికేషన్లు విడుదల చేశామని ఆయన వివరించారు. కమిషన్‌ కార్యదర్శి, సభ్యులతో కలిసి శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రిక్రూట్‌మెంట్లు, భవిష్యత్తు కార్యాచరణపై ఏపీపీఎస్సీ తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.

తాము విడుదల చేసిన నోటిఫికేషన్లలోనే స్ర్కీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్షల తేదీలతోపాటు ఖాళీల వివరాలను సైతం గతంలో కంటే భిన్నంగా క్యారీ ఫార్వర్డ్‌ పోస్టుల వివరాలతో సహా పొందుపరిచామన్నారు. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి... అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌(ఏఈఈ) పోస్టులకు 47,001 దరఖాస్తులు, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌ పోస్టులకు 16,130; అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ) ఉద్యోగాలకు 5411; హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు 1307 దరఖాస్తులు అందాయని ఉదయ భాస్కర్‌ వివరించారు. మిగిలిన నోటిఫికేషన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఈ నెల 19 వరకూ దరఖాస్తుల స్వీకరణ గడువు ఉందని, ఇప్పటి వరకూ ఆ ఉద్యోగాలకు 56,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. అభ్యర్థులు చివరి నిమిషంలో దరఖాస్తులు చేస్తుండటం వల్ల సర్వర్‌లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని, ఈ సమస్యను అధిగమించేందుకు వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.

గ్రూప్‌-1 ఎంపిక ఇలా..!: గ్రూప్‌-1 మెయిన్స్‌ రాసే వారిని ఎంపిక చేసే విషయంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ను ప్రాతిపదికగా తీసుకుంటామన్నారు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు సమన్యాయం జరిగేందుకుగాను యూపీఎస్సీ తరహాలోనే సివిల్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:12 లేదా 1:15 నిష్పత్తిలో జనరల్‌గా అభ్యర్థులను ఎంపిక చేసేలా కటాప్‌ మార్కులను నిర్ణయించేందుకు ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చిందని ఉదయభాస్కర్‌ చెప్పారు. ఏ రిజర్వేషన్‌ కేటగిరీలో అయితే అందుకు తగిన సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కారో... అక్కడ కటాఫ్‌ మార్కులను తగ్గిస్తామని తెలిపారు.

కొత్తగా వచ్చే నోటిఫికేషన్ల వివరాలు
డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (ఐ అండ్‌ పీఆర్‌) - 4 ఖాళీలు
సెరీకల్చర్‌ ఆఫీసర్‌ - 13 ఖాళీలు
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ (గ్రేడ్‌-3) - 60 ఖాళీలు
అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ - 78 ఖాళీలు
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌) - 6 ఖాళీలు
తెలుగు రిపోర్టర్‌ (లెజిస్లేచర్‌) - 5 ఖాళీలు
ఇంగ్లిష్‌ రిపోర్టర్‌ (లెజిస్లేచర్‌) - 10 ఖాళీలు
ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ - 50 ఖాళీలు
ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ - 330 ఖాళీలు
అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ - 100 ఖాళీలు
అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌ - 190 ఖాళీలు
లెజిస్లేటివ్‌ ఆఫీసర్‌ - 3 ఖాళీలు
రిసెర్చ్‌ ఆఫీసర్‌ - 2 ఖాళీలు
జూనియర్‌ అసిస్టెంట్‌ -కమ్‌- కంప్యూటర్‌ అసిస్టెంట్‌ - 670 ఖాళీలు
APPSC - 14 Job notifications- Details... ఈ నెలాఖరులోపు 14 ఉద్యోగ ప్రకటనలు క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలన్నీ భర్తీకి ఏర్పాట్లు అందరికీ సమన్యాయం జరిగేలా కసరత్తు: ఏపీపీఎస్సీ చైర్మన్‌

0 comments:

Post a Comment

LATEAT UPDATES

LATEST YOU TUBE VEDIOS


Teachers Corner

Acadamic info

High School

Primary School Info

Top